Breaking News

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ (డిసెంబర్ 18, 2025)న అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరగనున్నాయి


Published on: 02 Dec 2025 16:17  IST

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ (డిసెంబర్ 18, 2025)న అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరగనున్నాయి. 

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ 40 మందికి పైగా కార్పొరేటర్లు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు.గతంలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన ఈ కార్పొరేటర్లు ఇటీవల అధికారంలో ఉన్న టీడీపీకి మద్దతు ప్రకటించారు.మేయర్, ఆమె భర్త అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానంపై సమావేశానికి తేదీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 54 డివిజన్లకు గాను టీడీపీకి 42 మంది కార్పొరేటర్ల మద్దతు ఉన్నందున, అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి