Breaking News

మంత్రి రామ్మోహన్ నాయుడు కొత్త విమానయాన సంస్థలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 2025, డిసెంబర్ 9న రాజ్యసభలో మాట్లాడుతూ, దేశంలో కొత్త విమానయాన సంస్థలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.

Published on: 09 Dec 2025 13:42  IST

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 2025, డిసెంబర్ 9న రాజ్యసభలో మాట్లాడుతూ, దేశంలో కొత్త విమానయాన సంస్థలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.

 ఏ ఒక్క విమానయాన సంస్థ గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని మంత్రి పేర్కొన్నారు.ఇటీవల ఇండిగో సంస్థకు చెందిన భారీ సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.కొత్త సంస్థలను ఆహ్వానించినప్పటికీ, భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఇండిగో విమానాల రద్దు వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి