Breaking News

లోకో పైలట్స్ లేకుండా 70 కిమీ పరుగులు పెట్టిన గూడ్స్ రైలు

లోకో పైలట్స్ లేకుండా ఓ గూడ్స్ రైలు 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. కలకలం సృష్టించిన ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో చోటు చేసుకుంది. 53 వ్యాగన్ల చిప్‌ స్టోన్స్‌ లోడుతో జమ్ము కశ్మీర్‌ నుంచి పంజాబ్‌ బయలుదేరిన గూడ్స్‌ రైలు జమ్ములోని కథువా రైల్వేస్టేషన్‌లో ఆగింది. అయితే లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుండా వెళ్లిపోయారు.


Published on: 26 Feb 2024 17:21  IST

అయితే హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో.. రైలు వేగం పుంజుకుని పట్టాలపై పరుగులు తీసింది. 70 కిలో మీటర్లకు పైగా ప్రయాణించింది. ఒకానొక దశలో సుమారు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో కూడా రైలు ప్రయాణించినట్లు తెలుస్తోంది. లోకో పైలట్లు లేకుండా గూడ్స్ రైలు వెళుతుందని అధికారులకు సమాచారం అందడంతో.. అప్రమత్తమయ్యారు. ఎట్టకేలకు పంజాబ్ ముఖేరియన్‌లోని ఊంచీ బసీ సమీపంలో రైలును ఇసుక బస్తాల సాయంతో నిలిపివేశారు. అయితే సుమారు గంటన్నర పాటు లోకో పైలట్లు లేకుండా పట్టాలపై గూడ్స్ రైలు ప్రయాణించగా.. ఆ సమయంలో ఎటుంటి ట్రైన్ లేకపోవడం పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. రైలు ఆగాక.. ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి