Breaking News

నేను తప్పు చేశాను.. సుప్రీంకోర్టులో అంగీకరించిన అరవింద్ కేజ్రీవాల్!!

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాను తప్పు చేశానని సుప్రీంకోర్టులో ఒప్పుకున్నారు. పరువు నష్టం కేసులో విచారణకు హాజరైన కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించారు. బీజేపీ ఐటీ సెల్‌కు సంబంధించిన ఓ వీడియోను ఒక యూట్యూబర్ అప్‌లోడ్ చేయగా, అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు కాగా. తాజాగా ఆ వీడియోను రీట్వీట్ చేసి తాను తప్పు చేశానని సుప్రీం కోర్టు ముందు కేజ్రీవాల్ ఒప్పుకున్నారు.


Published on: 26 Feb 2024 19:03  IST

పరువు నష్టం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీకి సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసిన కేసులో కేజ్రీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు అధికారులను ఆదేశించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీ 2018లో చేసిన ఓ యూట్యూబ్ వీడియోను కేజ్రీ రీట్వీట్ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు షేర్ చేయడం కూడా నేరమే అవుతుందని వ్యాఖ్యానించింది.

ఇక ఈ పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు తెలియజేయడంతో. ఆయన తన తప్పును అంగీకరించారని ఇక ఈ కేసును ఇక్కడితో మూసివేయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఫిర్యాదుదారుడైన వికాస్ సాంకృత్యాయన్‌ను అడిగింది. మరోవైపు, ఈ కేసులో మార్చి 11 వ తేదీ వరకు ట్రయల్‌ కోర్టు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో కేజ్రీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
 

Follow us on , &

ఇవీ చదవండి