Breaking News

శ్రీశైలంలో కుంభాభిషేకానికి తేదీ ఖరారు చేసిన ఆలయ అధికారులు

శ్రీశైలంలో కుంభాభిషేకాన్ని ఈ నెల 16 నుంచి 21 వరకు నిర్వహించాలని హైకోర్టు సూచించడంతో అధికారులు కుంభాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మల్లికార్జున స్వామి గర్భగుడి ఆలయంలో ఉన్న 4 గోపురాలతో పాటు అమ్మవారి ఆలయం వద్దనున్న గోపురానికి, ఉపాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.


Published on: 09 Feb 2024 18:43  IST

 శ్రీశైలంలో కుంభాభిషేకానికి తేదీలు ప్రకటించిన ఆలయ అధికారులు. హైకోర్టు తీర్పుతో ఐదేళ్లుగా వాయిదా పడుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో కుంభాభిషేకం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 21 వరకు కుంభాభిషేకం నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురాలకు కలశ ప్రతిష్ఠాపన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు  వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు అయోమయంలో పడ్డారు.
ఇప్పటికే మహాకుంభాబిషేకం నిర్వహించేందుకు గతంలో రెండు సార్లు ముహూర్తాలు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వాయిదాలు వేశారు. ఈసారైనా సక్రమంగా జరుగుతాయా లేదా? అనే టెన్షన్ నెలకొంది.
 

Follow us on , &

ఇవీ చదవండి