Breaking News

టెక్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన గూగుల్.. ఈ ఏడాదిలో కూడా లేఆఫ్‌లు

టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి లేఆఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. తాజాగా ది వెర్జ్ నివేదిక పేర్కొన్న దాని ప్రకారం, 2024 ఏడాదిలో గూగుల్‌ మరికొంత మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది.


Published on: 18 Jan 2024 18:52  IST

టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి లేఆఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. తాజాగా ది వెర్జ్ నివేదిక పేర్కొన్న దాని ప్రకారం, 2024 ఏడాదిలో గూగుల్‌ మరికొంత మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు అంతర్గత మెమోను జారీ చేసినట్లు సమాచారం. టెక్ కంపెనీ ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది. పని, ఖర్చుల భారాన్ని తగ్గించడానికి ఆటోమేషన్‌ను అవలంబించాలని చూస్తుంది. దీని కారణంగానే కొత్త ఏడాదిలో మరికొంత మంది ఉద్యోగులను తొలగిస్తుంది. ఇంతకుముందు గూగుల్ తన వాయిస్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ టీమ్‌ల నుంచి వందల మందిని తొలగించింది. 2023లో ఒకేసారి తన ఉద్యోగుల్లో 12,000 మంది తొలగించింది. ఇటీవల కాలంలో కంపెనీ తన వ్యయ ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలని చూస్తుంది. ఈ పెట్టుబడులను AI తో పాటు మరిన్ని విభాగాలకు కేటాయించాలని చూస్తోంది. దానిలో భాగంగా 2024 చివరి నాటికి కూడా లేఆఫ్‌ల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి