Breaking News

బుర్జ్ ఖలీఫా ఉన్న డౌన్‌టౌన్ ప్రాంతంలో కొన్ని పేలుళ్లు సంభవించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

దుబాయ్ డౌన్‌టౌన్ (Downtown Dubai) ప్రాంతంలో మార్చి 12, 2026 గురువారం నాడు పేలుళ్లు సంభవించాయి.బుర్జ్ ఖలీఫా ఉన్న డౌన్‌టౌన్ ప్రాంతంలో కొన్ని పేలుళ్లు సంభవించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.


Published on: 12 Mar 2026 18:29  IST

దుబాయ్ డౌన్‌టౌన్ (Downtown Dubai) ప్రాంతంలో మార్చి 12, 2026 గురువారం నాడు పేలుళ్లు సంభవించాయి.బుర్జ్ ఖలీఫా ఉన్న డౌన్‌టౌన్ ప్రాంతంలో కొన్ని పేలుళ్లు సంభవించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఒక డ్రోన్ షేక్ జాయెద్ రోడ్ (Sheikh Zayed Road) లోని ఒక భవనం పైభాగంలో పడిపోవడంతో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని Dubai Media Office వెల్లడించింది.అల్ బదా (Al Bada'a) నివాస ప్రాంతం మీదుగా పొగ మేఘాలు కమ్ముకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన దాడులను ముమ్మరం చేయడమే దీనికి కారణమని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. 

డౌన్‌టౌన్ మరియు బుర్జ్ ఖలీఫా పరిసరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి