Breaking News

అంతరిక్షంలో 286 రోజులు- సురక్షితంగా భూమికి సునీతా విలియమ్స్

వ్యోమనౌక మొరాయించడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భువిపై సురక్షితంగా అడుగుపెట్టారు..


Published: 19 Mar 2025 10:53 IST

వ్యోమనౌక మొరాయించడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భువిపై సురక్షితంగా అడుగుపెట్టారు..

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన సునీతా విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.. డ్రాగన్‌ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే.. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌లను స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు.. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు సురక్షితంగా పుడమిని చేరినట్లు నాసా ప్రకటించింది..

Follow us on , &

ఇంకా (More)