Breaking News

గాలివాన బీభత్సం.. నిండా మునిగిన మిర్చి రైతులు

ఎండనకా.. వాననకా శ్రమించి పండించిన పంటలను శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం ముంచేసింది. దీంతో రైతన్న తీరని కష్టాల్లో పడ్డాడు. ప్రభుత్వం ఆదుకుంటే తప్పా బతకలేని దయనీయ పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు.


Published: 17 Mar 2023 07:42 IST

ఎండనకా.. వాననకా శ్రమించి పండించిన పంటలను శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం ముంచేసింది. దీంతో రైతన్న తీరని కష్టాల్లో పడ్డాడు. ప్రభుత్వం ఆదుకుంటే తప్పా బతకలేని దయనీయ పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు.

ఎండనకా.. వాననకా శ్రమించి పండించిన పంటలను శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం ముంచేసింది. దీంతో రైతన్న తీరని కష్టాల్లో పడ్డాడు. ప్రభుత్వం ఆదుకుంటే తప్పా బతకలేని దయనీయ పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. మిడుతూరు, జూపాడు బంగ్లా మండలాలలోకురిసిన భారీ వడగండ్ల వాన బీభత్సానికి వేల ఎకరాల్లో పండించినపంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలోనే నంద్యాల జిల్లాలో రైతులు తమ మిర్చి పంటను అమ్ముకోవడానికి గుంటూరు (Guntur) కు వేళాల్సిన పని లేకుండా నంద్యాల జిల్లా (Nandyal District) లోనే అమ్ముకునే విధంగా కొత్తగా మిర్చి యార్డును ఏర్పాటు చేసారు. నంద్యాల జిల్లాలో మిర్చియార్డ్ ఏర్పాటు అవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రైతులు సంతోషం వ్యక్తం చేసారు.

అందులోనూ ఎండుమిర్చి కర్నూలు జిల్లాలో బంగారంతో సమానంగా ధర పలకడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండపోయాయి. ఇలా మిర్చి ధరలు బాగా పెరిగాయి అని ఆనందపడే లోపే అకాల వర్షాలు రైతుల ఆనందాలని ఆవిరి చేసాయి. పంట దిగుబడి వచ్చేసరికి అకాల వర్షాలు కారణంగా పంట అంత నెలకొరిగింది. దింతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు అన్నదాతలు.

ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో వాతావరణంలో అనూహ్య మార్పులు అన్నదాతల్లో గుబులు రేపాయి. భారీ వడగండ్ల వానకు మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల పరిధిలో ఎండుమిర్చి, మొక్కజొన్న, ఆరబోసిన రైతులు అకాల వడగండ్ల వానకు అందోళనకు .మిడుతూరు నందికొట్కూరు, జూపాడు బంగ్లా మండలాల్లో రబీలో సాగు చేసిన మొక్కజొన్న, మిరప, ఉల్లి దిగుబడులను. ప్రస్తుతం కల్లాల్లో ఆరబెట్టారు. తుపాను ప్రభావంతో ఒక్కసా మబ్బులు కమ్మేశాయి.

భారీగా వడగండ్ల వాన పడడంతో ఆరబోసిన మొక్కజొన్నలు, ఎండుమిరపను తడిసిపోవడంతో పాటు మరోవైపు గమిమము, జొన్న పంటలు పాలాల్లో ఉండడంతో అకాల వడగండ్ల వాన వల్ల సుమారు 400 ఎకరాల పంట నష్టం జరిగిందని,ప్రభుత్వం ఈ పంట నష్టం నుంచి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow us on , &

ఇంకా (More)