Breaking News

Hyderabad: దేశంలోనే అత్యంత ఖరీదైన IT కారిడార్‌గా కోకాపేట్..

దేశంలోనే అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్‌గా కోకాపేట్.. ఏకరం రూ.80 కోట్లు.. బెంగళూరు, ముంబై కూడా మనవెనుకే .. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రికార్డు స్థాయిలో ఊపందుకుంటోంది. ధరలు దేశంలో ఎక్కడా లేనివిధంగా...


Published: 19 Aug 2023 14:34 IST

దేశంలోనే అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్‌గా కోకాపేట్.. ఏకరం రూ.80 కోట్లు.. బెంగళూరు, ముంబై కూడా మనవెనుకే .. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రికార్డు స్థాయిలో ఊపందుకుంటోంది. ధరలు దేశంలో ఎక్కడా లేనివిధంగా...

Most Expensive IT Corridor: హైదరాబాద్‌ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ప్రపంచ స్థాయి ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో రియల్ ఎస్టేట్‌ పుంజుకుంటోంది. ఇటీవల దేశంలో భూముల ధరలు, ఫ్లాట్స్ రెంట్లు, ప్లాట్లు, రిటైల్ లీజింగ్, ఆఫీస్ స్పేస్ ఇలా ఏది చూసినా హైదరాబాద్ పేరు అందులో ప్రముఖంగా వినిపిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పుడు ఐటీ బెల్ట్‌గా ఉద్భవిస్తోంది కోకాపేట్. కొద్దిరోజుల కిందటి వరకు ఎకరానికి రూ. 40 కోట్ల వరకు ఉన్న భూమి విలువ.. ఇటీవల జరిగిన వేలంలో సగటున రూ.75 నుంచి 80 కోట్ల వరకు పలికింది. ఇక రికార్డు స్థాయిలో ఒక ప్లాట్‌లో ఎకరం భూమి రూ.100 కోట్లకుపైగా కూడా పలకడం గమనార్హం.

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఇలా భూముల ధరలు దాదాపు 100 శాతం పెరగడం.. ఐటీ రంగానికి రియాల్టీలో ప్రాధాన్యం పెరగడం గురించి మాత్రమే కాదు.. దేశంలోనే ఐటీ కారిడార్లలో నంబర్‌వన్ స్థానానికి చేరిందనేది చాలా మందికి తెలియకపోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. ఐటీ కారిడార్లలో భూముల ధరల విషయానికి వస్తే ఇప్పుడు కోకాపేట్ నంబర్‌వన్. బెంగళూరు, చెన్నై, ముంబై, దిల్లీ-NCR, పుణె కూడా మన వెనుకే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.

ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరులోని ప్రముఖ ఐటీ బెల్ట్‌లుగా పేరొందిన వైట్‌ఫీల్డ్స్, ఎలక్ట్రానిక్ సిటీ లేదా సర్జాపుర్ రోడ్డుల్లో ఎకరానికి గరిష్టంగా సగటున రూ.30 నుంచి 40 కోట్ల వరకే ఉంది. కొన్ని అరుదైన డీల్స్ మాత్రమే ఎకరానికి రూ. 60 కోట్ల వరకు పలికింది. ఇది కోకాపేట్‌తో పోలిస్తే రూ. 20 కోట్లు తక్కువే ఉంది. ఇది దేశ ఐటీ రాజధానిగా బెంగళూరు స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని అన్నారు ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ రెడ్డి.
 

Follow us on , &

ఇంకా (More)