Breaking News

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ రూట్‌లో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ!

హైదరాబాద్ ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ మధ్య వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఉక్కుతో నిర్మించిన 2.6 కిలో మీటర్ల పొడవైన నాయిని నర్సింహా రెడ్డి ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.

Published: 21 Aug 2023 05:54 IST

హైదరాబాద్ ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ మధ్య వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఉక్కుతో నిర్మించిన 2.6 కిలో మీటర్ల పొడవైన నాయిని నర్సింహా రెడ్డి ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.

హైదరాబాద్ ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ మధ్య వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఉక్కుతో నిర్మించిన 2.6 కిలో మీటర్ల పొడవైన నాయిని నర్సింహా రెడ్డి ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. రూ.450 కోట్లతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలోనే అతి పొడవైనది. ఇది అందుబాటులోకి రావటంతో ఇందిరాపార్క్ జంక్షన్ మొదలు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు పూర్తిగా సిగ్నల్ ఫ్రీ జర్నీ సాగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గనుంది.

Follow us on , &

ఇంకా (More)