Breaking News

EPFO: హమ్మయ్య... ఆ గడువు 60 రోజులు పెంచిన ఈపీఎఫ్ఓ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ ఖాతాదారులకు ఊరట కల్పించింది. హయ్యర్ పెన్షన్ (EPF Higher Pension) ఆప్షన్ ఎంచుకోవడానికి గడువు పొడిగించింది.


Published: 27 Feb 2023 07:42 IST

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ ఖాతాదారులకు ఊరట కల్పించింది. హయ్యర్ పెన్షన్ (EPF Higher Pension) ఆప్షన్ ఎంచుకోవడానికి గడువు పొడిగించింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ ఖాతాదారులకు ఊరట కల్పించింది. హయ్యర్ పెన్షన్ (EPF Higher Pension) ఆప్షన్ ఎంచుకోవడానికి గడువు పొడిగించింది. ఈ గడువు మార్చి 3 వరకేనని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధిక పెన్షన్ అంశంపై ఈపీఎఫ్ఖాతాదారుల్లో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు గడువు ముంచుకొస్తుండటంతో ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. హయ్యర్ పెన్షన్ఆప్షన్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఈపీఎఫ్ఓ ఇంకొన్ని రోజులు గడువు ఇస్తుందా అని ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఊరట కల్పించింది ఈపీఎఫ్ఓ.

ఈపీఎఫ్ఓ ఇచ్చిన అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవడానికి మరో 60 రోజులు గడువు లభించింది. అంటే 2023 మార్చి 3 నుంచి మే 3 వరకు పొడిగించింది ఈపీఎఫ్ఓ. అర్హులైన సభ్యులు అందరూ తమ ఎంప్లాయర్స్‌తో కలిసి మే 3 వరకు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. యూనిఫైడ్ మెంబర్స్ పోర్టల్‌లో కూడా లింక్ యాక్టివేట్ అయింది. ఆన్‌లైన్‌లో కూడా ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Follow us on , &

ఇంకా (More)