Breaking News

Delhi Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం..హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్

Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఎవరంటే?


Published: 07 Mar 2023 06:42 IST

Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఎవరంటే?

Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు గోరంట్ల బుచ్చిబాబుతో సహా పలువురిని ఇటీవల అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ కేసులో ఈడీ (Enforcement Directorate) మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ  (Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు. 2 రోజుల పాటు పిళ్ళైని విచారించిన అధికారులు అరెస్ట్ చేశారు. కాగా ఇప్పటివరకు లిక్కర్ స్కాంలో 11 మందిని అరెస్ట్ చేశారు.

కాగా ఈ కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతను జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తీహార్ జైల్లోనే మనీష్ సిసోడియాను అధికారులు విచారించనున్నారు. అయితే ఈ విచారణలో అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. దానికి సిసోడియా ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. సిసోడియా చెప్పే సమాధానాల ఆధారంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న అవకాశం లేకపోలేదు.

ఇక ఈ కేసులో అరబిందో శరత్ చంద్రారెడ్డి తీహార్ జైల్లో ఉండగా..అయన బెయిల్ పిటీషన్ ను సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. అయితే శరత్ చంద్రారెడ్డి మనీలాండరింగ్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మరి ఈ విచారణలో శరత్ చంద్రారెడ్డికి ఊరట లభిస్తుందో లేదో చూడాలి.

Follow us on , &

ఇంకా (More)