Breaking News

TSPSC Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. వారందరికీ నోటీసులు ఇచ్చిన ఈడి..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ.. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. 


Published: 11 Apr 2023 04:52 IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ.. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ.. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. అలాగే సిట్ అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

ఇదిలాఉంటే.. టీఎస్‌పీఎస్‌సీ కేసుపై మంగళవారం నాడు కీలక విచారణ జరుగనుంది. కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదించనుంది సిట్. మరోవైపు ఈ కేసును సీబీఐతో విచారించాలని ఎన్ఎస్‌యూఐ సహా పలువురు పిటిషనర్లు హైకోర్టును కోరారు. సీపీడీవో, ఈవో ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ చేయాలని, సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపైనా దర్యాప్తు జరపాలి పిటిషనర్లు కోరారు. తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియను నిలిపేసేలా స్టే ఇవ్వాలి విజ్ఞప్తి చేశారు పిటిషనర్లు. ఈమేరకు హైకోర్టులో 76 మంది అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టు నేడు విచారణ జరుపనుంది. పిటిషనర్ల తరుపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ తంఖా వాదించనుండగా.. సిట్ నివేదికను జతపరుస్తూ కౌంటర్ దాఖలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

నెల రోజుల పాటు విచారించిన సిట్.. మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్ చేసింది. కీలక నిందితులుగా ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ లను పేర్కొంది. వీరు ఏఈ ఎగ్జామ్, గ్రూప్ -1, డిఎఓ ప్రశ్నా పత్రాలను లీక్ చేసినట్లు తేల్చింది సిట్. టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ చైర్మన్ ను సైతం విచారించిన సిట్.. బోర్డు సెక్రెటరీ, బోర్డ్ సభ్యులస్టేట్మెంట్లను నివేదికలో పొందపర్చింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక సైతం జత పరిచింది. నిందితుల పెన్ డ్రైవ్, మొబైల్స్‌లో ప్రశ్న పత్రాలు ఉన్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 150 మందిని విచారించింది సిట్. గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులతో పాటు అనుమానితులను విచారించింది సిట్. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిందితుల ఇళ్ళలో రోజుల తరబడి సోదాలు నిర్వహించింది. గత నెల 11వ తేదీన బేగం బజార్ పిఎస్‌లో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు నమోదవగా.. ఆ తరువాత సిట్‌కు కేసు బదిలీ చేశారు.

Follow us on , &

ఇంకా (More)