Breaking News

Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్‌జెండర్ల వేషంలో వసూళ్లు..

హైదరాబాద్: కొంతమంది ట్రాన్స్ జెండర్ల వేషం వేసుకొని నగరంలోని సెంటర్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మగవాళ్లే ట్రాన్స్ జెండర్లగా వేషం వేసుకొని ముఠాగా ఏర్పాడి వసూళ్లకు పాల్పడుతున్నారు.


Published: 19 Aug 2023 13:48 IST

హైదరాబాద్: కొంతమంది ట్రాన్స్ జెండర్ల వేషం వేసుకొని నగరంలోని సెంటర్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మగవాళ్లే ట్రాన్స్ జెండర్లగా వేషం వేసుకొని ముఠాగా ఏర్పాడి వసూళ్లకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్: కొంతమంది ట్రాన్స్‌జెండర్ల (Transgenders) వేషం వేసుకొని నగరంలోని సెంటర్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ (Traffic Signals) వద్ద వాహనదారులను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మగవాళ్లే ట్రాన్స్ జెండర్లగా వేషం వేసుకొని ముఠాగా ఏర్పాడి వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని నిన్న (శుక్రవారం) పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్‌ (Bihar)కు చెందిన కొంతమంది నగరానికి వచ్చి.. ముఠాగా ఏర్పడి ట్రాన్స్ జెండర్ల వేషాల్లో బెగ్గింగ్ (Begging) చేస్తున్నారు. సికింద్రాబాద్ (Secunderabad), ప్యారడైజ్ (Paradise), జూబ్లీబస్ స్టేషన్ (Jubilee Bus Station) వంటి పలు ముఖ్య ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్ల వేషాలతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. నార్త్ జోన్ పోలీసులు 17 మందిని అరెస్ట్ చేశారు. బెగ్గింగ్ ముఠా (Begging Gang)ను లీడ్ చేస్తున్న ఐదుగురు నిర్వాహకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Police Special Drive) నిర్వహించి అరెస్టు చేశారు. కాగా నకిలీ (Fake) ట్రాన్స్ జెండర్ల ఆగడాలపై రియల్ ట్రాన్స్‌జెండర్స్ (Real Transgenders) మండిపడుతున్నారు. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఆగడాలపై మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.

Follow us on , &

ఇంకా (More)