Breaking News

IT ఉద్యోగులకు శుభవార్త...

దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ప్రోగ్రామ్‌లోని పలు అంశాలను మరింతగా మెరుగుపరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని ఐటీ నిపుణుల నైపుణ్య స్థాయిని పెంచడం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ మేరకు భారత్‌కి చెందిన 5 లక్షల 25 వేల మంది ఐటీ నిపుణులు పొందేందుకు సిద్ధంగా ఉన్నారు.

Published: 16 Aug 2023 14:04 IST

డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ విస్తరణ పనుల కోసం కేంద్ర కేబినెట్ రూ.14,903 కోట్ల అదనపు వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి అమోదం పడిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ప్రోగ్రామ్‌లోని పలు అంశాలను మరింతగా మెరుగుపరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని ఐటీ నిపుణుల నైపుణ్య స్థాయిని పెంచడం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ మేరకు భారత్‌కి చెందిన 5 లక్షల 25 వేల మంది ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా రానున్న రోజుటల్లో ఇది మరింత సాధికారత, శ్రామికశక్తికి దారి తీసే అవకాశం ఉంది.

అలాగే ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ మరింత కష్టతరంగా మారడంతో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సామర్థ్యాలను పెంపొందించడంపై కూడా ప్రోగ్రామ్ దృష్టి సారిస్తోంది. ఇందు కోసమే 2 లక్షల 65 వేల మంది సైబర్ సెక్యూరిటీ సిబ్బంది శిక్షణ పొందనున్నారు. ఈ క్రమంలో ఉమాంగ్ ప్లాట్‌ఫామ్ గణనీయమైన ప్రోత్సాహాన్ని అందుకోనుంది. ఇప్పటికే ఉన్న 1700 సేవలకు అదనంగా 540  అద్భుతమైన 540 కొత్త మోడ్‌లు కలిశాయి. ఇవి సైటర్ సేవల యుటిలిటీ, యాక్సెసిబిలిటీని మరింతగా మెరుగుపరుస్తాయి.

Follow us on , &

ఇంకా (More)