Breaking News

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఈనెల 15 నుంచి జరిగే మూడో టెస్టులో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ డెబ్యూ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నా సరే.. ఆశించిన మేర రాణించలేకపోతున్న కేఎస్ భరత్‌ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.