Breaking News

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఏడు సంవత్సరాల వయస్సు నిండిన పిల్లలు తమ ఆధార్‌ను అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి చేసింది.

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామాను అందించడం ద్వారా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలి.

పాఠశాల అడ్మిషన్, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్‌షిప్‌లు మరియు ఇతర ప్రయోజనాల కోసం అప్‌డేట్‌ చేసిన బయోమెట్రిక్ సమాచారంతో చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డులు మాత్రమే పరిగణిస్తారు.

వారు ప్రయోజనాలు కోల్పోకూడదని అనుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయాలని, ప్రయోజనాలను కోల్పోవద్దని UIDAI సూచించింది.