Breaking News

శ్రీవారిని దర్శించుకున్నప్రముఖ సినీ నటి త్రిష

ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ ఫిబ్రవరి 19, 2026 (గురువారం) సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.


Published on: 20 Feb 2026 10:27  IST

ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ ఫిబ్రవరి 19, 2026 (గురువారం) సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.త్రిష గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు TTD అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

త్రిష సంప్రదాయబద్ధంగా స్కై బ్లూ కలర్ డ్రెస్ ధరించి చాలా సింపుల్‌గా కనిపించారు. ఆమెను చూసిన భక్తులు సెల్ఫీల కోసం ఎగబడటంతో ఆలయ వెలుపల సందడి నెలకొంది.

ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కాకుండా కోలీవుడ్‌లో సూర్యతో ‘కరుప్పు’ మరియు మలయాళంలో ‘రామ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి