Breaking News

భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో 2026 మార్చి 14న వివాహం చేసుకోబోతున్నారు.

భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో 2026 మార్చి 14న వివాహం చేసుకోబోతున్నారు. నేడు (మార్చి 10, 2026) కుల్దీప్ యాదవ్ తండ్రి రామ్ సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. 


Published on: 10 Mar 2026 12:28  IST

భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో 2026 మార్చి 14 వివాహం చేసుకోబోతున్నారు. నేడు (మార్చి 10, 2026) కుల్దీప్ యాదవ్ తండ్రి రామ్ సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. 

ముస్సోరి (ఉత్తరాఖండ్) లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది.మార్చి 13న హల్దీ, మెహందీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.మార్చి 17న లఖ్‌నవూలోని హోటల్ సెంట్రమ్ (Hotel Centrum) లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

వంశిక కుల్దీప్‌కు చిన్ననాటి స్నేహితురాలు. ఆమె ప్రస్తుతం LICలో పనిచేస్తున్నారు. వీరి నిశ్చితార్థం జూన్ 4, 2025న లఖ్‌నవూలో జరిగింది.వాస్తవానికి ఈ వివాహం 2025 నవంబర్‌లోనే జరగాల్సి ఉంది, కానీ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది. ఈ వేడుకకు బీసీసీఐ అధికారులు, ప్రస్తుత మరియు మాజీ క్రికెటర్లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి