Breaking News

సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అషు రెడ్డి

మిస్టరీ మ్యాన్‌తో అషు రెడ్డి ఫోటోలు హాట్ టాపిక్‌


Published on: 09 May 2026 15:54  IST

అషు రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఉంగరాలు మార్చుకున్నట్లు కనిపించే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఆమె సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే కాబోయే వరుడి ముఖం, వివరాలను మాత్రం ఆమె బయటపెట్టలేదు.

టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి, తరువాత బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత పాపులర్ అయింది. గ్లామర్ ఫోటోలు, బోల్డ్ కంటెంట్‌తో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా కొనసాగుతోంది.

మరోవైపు ఆమెపై నమోదైన మోసం కేసు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు తీసుకుందని ఆరోపిస్తూ షేక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఆరోపణలను అషు రెడ్డి ఖండిస్తూ, తనపై తప్పుడు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.

గతంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో అషు రెడ్డి మరింత వైరల్ అయ్యింది. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ ఫోటోలు, మిస్టరీ మ్యాన్, వివాదాలతో ఆమె మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి