Breaking News

మిస్ మెక్సికో ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో విశ్వసుందరి కిరీటాన్నిగెలుచుకున్నారు

మిస్ మెక్సికో ఫాతిమా బాష్ 2025 నవంబర్ 21న థాయిలాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 (Miss Universe 2025) పోటీల్లో విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు


Published on: 21 Nov 2025 12:35  IST

మిస్ మెక్సికో ఫాతిమా బాష్ 2025 నవంబర్ 21న థాయిలాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 (Miss Universe 2025) పోటీల్లో విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. నవంబర్ 21 శుక్రవారం బ్యాంకాక్, థాయిలాండ్‌ థాయిలాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్. థాయిలాండ్‌కు చెందిన ప్రవీణర్ సింగ్ (Praveenar Singh) ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మణిక విశ్వకర్మ (Manika Vishwakarma) టాప్ 12లో స్థానం పొందలేకపోయారు. ఈ పోటీలు ప్రారంభం కావడానికి ముందు నిర్వాహకులతో జరిగిన వివాదం కారణంగా ఫాతిమా బాష్ వార్తల్లో నిలిచారు. ఒక లైవ్ ఈవెంట్‌లో థాయ్ డైరెక్టర్ ఆమెను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత ఆమె, మరియు ప్రస్తుత మిస్ యూనివర్స్ (అప్పటికి) సహా పలువురు పోటీదారులు నిరసనగా వాకౌట్ చేశారు. ఈ సంఘటన తర్వాత, ఆమెకు అభిమానుల మద్దతు పెరిగింది మరియు చివరికి ఆమె విజేతగా నిలవడం విశేషం.

 

Follow us on , &

ఇవీ చదవండి