Breaking News

ప్రముఖ అమెరికన్ సింగర్ మరియు పాప్ స్టార్ ఆలివర్ ట్రీ బ్రెజిల్‌లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు

ప్రముఖ అమెరికన్ సింగర్ మరియు పాప్ స్టార్ ఆలివర్ ట్రీ (Oliver Tree) బ్రెజిల్‌లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 14 జూన్ 2026 ఆదివారం ఉదయం బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో రెండు హెలికాప్టర్లు గాల్లో ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Published on: 15 Jun 2026 11:51  IST

ప్రముఖ అమెరికన్ సింగర్ మరియు పాప్ స్టార్ ఆలివర్ ట్రీ (Oliver Tree) బ్రెజిల్‌లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 14 జూన్ 2026 ఆదివారం ఉదయం బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో రెండు హెలికాప్టర్లు గాల్లో ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

రియో డి జెనీరో పశ్చిమ ప్రాంతంలో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు గాల్లోనే బలంగా ఢీకొన్నాయి.ప్రమాదం జరిగిన తర్వాత ఒక హెలికాప్టర్ కార్ల డీలర్‌షిప్ పార్కింగ్ స్థలంలో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.ఈ ప్రమాదంలో ఆలివర్ ట్రీతో పాటు మొత్తం 6 మంది మరణించారు. వీరిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.

ఆలివర్ ట్రీ వయస్సు 32 సంవత్సరాలు.ఆయన పాడిన "Life Goes On", "Miss You" వంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి విపరీతమైన ప్రజాదరణ పొందాయి.తన వరల్డ్ టూర్ (సంగీత ప్రదర్శనల పర్యటన)లో భాగంగా ఆయన బ్రెజిల్ వెళ్లారు. ప్రమాదానికి కేవలం ఒక రోజు ముందే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రెజిల్ వీధుల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు.ప్రస్తుతం బ్రెజిల్ విమానయాన అధికారులు మరియు పోలీసులు ఈ రెండు హెలికాప్టర్లు ఢీకొనడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement