Breaking News

అయోధ్యలో అద్భుతం.. కళ్లు తెరిచి అటూ, ఇటూ చూస్తున్న బాల రాముడు

అయోధ్యలో కొలువైన బాలరాముడు కళ్లు తెరిచాడు. తల అటూ ఇటూ కదిలిస్తూ ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Published on: 19 Mar 2025 17:54  IST

భక్తులను పరవశింపజేస్తున్న బాలరాముడి రూపం

అయోధ్య: 500 ఏళ్లుగా కొనసాగిన అయోధ్య వివాదానికి తెరపడడంతో, దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది.. భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని.ప్రారంభోత్సవం అయింది. ఈ క్రమంలోనే అయోధ్యలో కొలువైన బాలరాముడిని చూసి కోట్లాది మంది రామ భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. ఈ మహత్తరమైన క్షణాన్ని అనుభవించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తుల రాక భారీగా పెరిగింది

సోషల్ మీడియాలో అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి చిత్రాలు, వీడియోలు విస్తృతంగా మారుమోగిపోతోంది. అయితే, తాజాగా ఒక ప్రత్యేక వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో బాలరాముడు కళ్లు తెరిచి చిరునవ్వుతో కంటి రెప్పలు కొడుతూ, తలను కొద్దిగా కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. భక్తులు దీనిని చూసి విగ్రహం కాదు, స్వయంగా రాముడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లుందని భావిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు భక్తి భావంతో మునిగిపోయి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియో నిజమేనా?

అయితే, వైరల్ అయిన ఈ వీడియో పూర్తిగా ఎడిటింగ్ చేసినదే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయోధ్య గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ఆధారంగా తీసుకుని గ్రాఫిక్ ఎఫెక్ట్స్ ద్వారా దీనిని రూపొందించారు. ఇదే విషయాన్ని కొంత మంది నెటిజన్లు కూడా వ్యాఖ్యానిస్తూ, ఆధునిక టెక్నాలజీతో ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు రూపొందించడం సాధారణమే అని చెబుతున్నారు.

నిజమైనదైనా, సృష్టించిందేనైనా, ఈ వీడియో రామ భక్తుల హృదయాల్లో భక్తి పరవశాన్ని రేకెత్తించింది. రామ మందిరం దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భక్తులకు ఇది మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి