Breaking News

కుప్పం కేంద్రంగా సీఎం జగన్ కీలక ప్రకటన - టార్గెట్ చంద్రబాబు??

ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో కీలక వ్యాఖ్యలు చేసారు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు ఏం చేసారని ప్రశ్నించారు. తన 58 నెలల పాలనలో కుప్పంకు జరిగిన మంచి గుర్తించాలని కోరారు. జరిగిన లబ్దిని వివరించారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు. రంగాను హత్య చేయించింది ఎవదో అందరికీ తెలుసని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.


Published on: 26 Feb 2024 14:41  IST

సీఎం జగన్‌ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తిచేశామని పేర్కొన్నారు. 35 ఏళ్ల కాలంగా కుప్పంకు ఏమీ చేయని చంద్రబాబును గెలిపించాల్సిన అవసరం ఉందా అని జగన్ ప్రశ్నించారు.

చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారని గుర్తు చేసారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యే గా ఉండి కనీసం ఇళ్లు కట్టుకోలేదననారు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. కుప్పం ప్రజల మంచితనానికి జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క స్కీమ్ ఐనా ఉందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా అని నిలదీసారు.

Follow us on , &

ఇవీ చదవండి