Breaking News

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో మార్చి 1, 2026 న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.


Published on: 02 Mar 2026 12:48  IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో మార్చి 1, 2026 న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. కళ్యాణదుర్గం మండలంలోని గుబనపల్లి   గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.అనంతపురం నుండి రాయదుర్గానికి వెళ్తున్న RTC బస్సు, కర్ణాటకకు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులను కర్ణాటకలోని ముదిగలకు చెందిన చంద్రకళ (32), ఆమె సోదరులు శివకుమార్ (36)హనుమంత రాయుడు (40) గా పోలీసులు గుర్తించారు.వీరంతా ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కళ్యాణదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి