Breaking News

అన్నం ముద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అన్నం ముద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన.


Published on: 31 Jan 2026 10:29  IST

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అన్నం ముద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన.జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని మార్కండేయపురం కాలనీకి చెందిన అభయ ఆంజనేయకుమార్, భానుశిరీష దంపతుల రెండేళ్ల కుమార్తె జెస్సీదీవెన, శుక్రవారం (జనవరి 30, 2026) భోజనం చేస్తుండగా గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి ఊపిరి ఆడక మరణించింది.చిన్నారి తల్లి మరియు నాయనమ్మ పని మీద బయటకు వెళ్లగా, తండ్రి ఆంజనేయకుమార్ పాపకు ముద్దపప్పుతో కలిపిన అన్నాన్ని తినిపిస్తున్నారు. ఆ సమయంలో గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుపోవడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది.

హుటాహుటిన చిన్నారిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.జంగారెడ్డిగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి