Breaking News

కుప్పంలో భారీ ఎత్తున ఈ-సైకిళ్ల పంపిణీ

జనవరి 31, 2026న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఒకే రోజు భారీ ఎత్తున ఈ-సైకిళ్ల (E-Cycles) పంపిణీ చేసి నూతన చరిత్ర సృష్టించారు. 


Published on: 31 Jan 2026 15:57  IST

జనవరి 31, 2026న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఒకే రోజు భారీ ఎత్తున -సైకిళ్ల (E-Cycles) పంపిణీ చేసి నూతన చరిత్ర సృష్టించారు. 

కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం తుమ్మిసి (తులసినాయనపల్లి) వద్ద జరిగిన బహిరంగ సభలో 5,555 -సైకిళ్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

ఈ పంపిణీ అనంతరం శివపురం నుండి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు వేలాది ఈ-సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.కుప్పం నియోజకవర్గాన్ని కాలుష్య రహితంగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సైకిళ్లను ప్రజలు తమ ఇంటిపై అమర్చుకున్న సోలార్ విద్యుత్తుతో ఛార్జింగ్ చేసుకోవచ్చని, దీనివల్ల పైసా ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

'స్త్రీ' (STREE) చొరవలో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (SHG) మహిళలకు ఈ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా వారి ఆర్థిక స్వేచ్ఛను పెంపొందించడం ఈ పథకం ఉద్దేశ్యం.

ఒక్కో ఈ-సైకిల్ విలువ సుమారు ₹23,999 కాగా, లబ్ధిదారులు ₹5,000 మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా పొందేలా రాయితీ కల్పించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి