Breaking News

విజయవాడ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిబ్రవరి 4, 2026 న పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) ఆపరేషన్ నిర్వహించారు.

Published on: 04 Feb 2026 14:24  IST

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిబ్రవరి 4, 2026 న పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) ఆపరేషన్ నిర్వహించారు.

సరైన పత్రాలు లేని సుమారు 50 బైకులు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సోదాల్లో ఏడుగురు రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.దాదాపు 53 మంది అనుమానితులను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేరాల నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ తనిఖీలు ప్రధానంగా అనుమానిత ప్రాంతాలు మరియు రౌడీ షీటర్లు నివసించే కాలనీలలో నిర్వహించబడ్డాయి

Follow us on , &

ఇవీ చదవండి