Breaking News

అన్నవరంలో కోటి తులసి పూజా మహోత్సవం

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో 2026 ఫిబ్రవరి 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు కోటి తులసి పూజా మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. 


Published on: 06 Feb 2026 15:57  IST

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో 2026 ఫిబ్రవరి 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు కోటి తులసి పూజా మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. 2026 ఫిబ్రవరి 6 (శుక్రవారం) నుండి ఫిబ్రవరి 15 (ఆదివారం) వరకు 10 రోజుల పాటు జరుగుతుంది.ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 7:30 గంటలకు మాఘ బహుళ పంచమి శుభ ముహూర్తాన ఈ పూజ ప్రారంభమవుతుంది.

ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు నామ మంత్ర జపంతో ఈ పూజా కార్యక్రమాలు సాగుతాయి. సుమారు 100 మంది వేద పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 8:00 గంటలకు రుద్రహోమం ప్రారంభమై, 11:00 గంటలకు పూర్ణాహుతితో ఈ మహోత్సవం ముగుస్తుంది.

లోక కళ్యాణం మరియు రాష్ట్ర సుభిక్షం కోసం నిర్వహించే ఈ పూజలో రోజూ దాదాపు 11 లక్షల తులసి దళాలను (మొత్తం మీద కోటి తులసి దళాలు) ఉపయోగిస్తారు.దాతలు లేదా భక్తులు తమ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించుకోవడానికి నిర్ణీత రుసుము చెల్లించి ఈ యజ్ఞంలో పాల్గొనవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి