Breaking News

పులివెందుల ఆర్డీవో కార్యాలయం డీటి అరెస్ట్

ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం నాడు కడప జిల్లా పులివెందుల ఆర్డీవో (RDO) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

Published on: 13 Feb 2026 16:24  IST

ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం నాడు కడప జిల్లా పులివెందుల ఆర్డీవో (RDO) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ (DTనాగేంద్రప్రసాద్ రూ. 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామంలోని మసీదుకు సంబంధించిన 36 ఎకరాల భూమిని ఆన్‌లైన్లో నమోదు చేసేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు.బాధితుడు కరీముల్లా ఏసీబీని ఆశ్రయించగా, వ్యూహం ప్రకారం దాడులు జరిగాయి.

కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిందితుడిని అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి