Breaking News

ఫ్రెంచ్ యువకుడు తెలుగు అమ్మాయికి వివాహం

యానాంలో ఫిబ్రవరి 25, 2026 బుధవారం రాత్రి ఒక ఫ్రెంచ్ యువకుడు మరియు తెలుగు అమ్మాయికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.


Published on: 26 Feb 2026 10:44  IST

యానాంలో ఫిబ్రవరి 25, 2026 బుధవారం రాత్రి ఒక ఫ్రెంచ్ యువకుడు మరియు తెలుగు అమ్మాయికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వధువు అనిత అనూష, యానాంలో నివసించే మల్లిపూడి వెంకటేశ్వరరావు మరియు అనంతలక్ష్మి దంపతుల కుమార్తె. వరుడు రొమెన్‌ షులెర్‌, ఫ్రాన్స్‌లో ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ సినిమాల్లోనూ నటిస్తున్నారు.

యానాం కనకాలపేట శివారులోని ఒక రిసార్ట్‌లో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.అనూష ప్యారిస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సమయంలో రొమెన్‌తో పరిచయం ఏర్పడింది, అది కాస్త ప్రేమగా మారింది. భారతీయ సంస్కృతి మరియు వివాహ వ్యవస్థ పట్ల ఉన్న గౌరవంతో రొమెన్‌ ఇక్కడి సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ వేడుక కోసం వరుడి తల్లిదండ్రులు ఫిలిప్ మరియు మరి షులెర్‌తో పాటు సుమారు 45 మంది ఫ్రెంచ్ పౌరులు యానాం వచ్చారు. వివాహానంతరం ఈ కొత్త జంట గుర్రపు బగ్గీలో ఊరేగి స్థానికులను ఆకట్టుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి