Breaking News

బాపట్లలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాపట్ల జిల్లా చినగంజాం మార్కెట్ యార్డు వద్ద శనగల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం, 2026 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. 


Published on: 27 Feb 2026 15:24  IST

బాపట్ల జిల్లా చినగంజాం మార్కెట్ యార్డు వద్ద శనగల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం, 2026 ఫిబ్రవరి 27 ప్రారంభించారు. చింతగుంపల పీఏసీఎస్ (PACS) ఛైర్మన్ బత్తుల శ్రీనివాసరావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.రబీ 2025-26 సీజన్‌లో శనగలు పండించిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించడం.

క్వింటా శనగలకు ప్రభుత్వం రూ. 5,875 మద్దతు ధరగా నిర్ణయించింది.పంటను విక్రయించిన 15 రోజుల లోపు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది.రైతులు తమ పంటను విక్రయించే ముందు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో (RSK) CMAPP ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు కోరారు. 
 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement