Breaking News

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ల మండలం హెచ్.టి. హళ్లి వడ్రహట్టి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు.


Published on: 02 Mar 2026 14:13  IST

శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ల మండలం హెచ్.టి. హళ్లి వడ్రహట్టి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. వీరేశ్ అనే తాపీ మేస్త్రి తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, మరియు అతని ఇద్దరు పిల్లలు రోహిణి, రచనలు ఫిబ్రవరి 27 రాత్రి నుంచి కనిపించకుండా పోయారు.మద్యానికి బానిసైన వీరేశ్ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఫిబ్రవరి 27న ఇంట్లో మరోసారి గొడవ జరగడంతో, అదే రోజు రాత్రి ఆ నలుగురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

బంధువులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మార్చి 1 పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గౌతమి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం వీరేశ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి