Breaking News

చిత్తూరులో యువకుడి అనుమానాస్పద మృతి

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎంకే పురం పంచాయతీ పరిధిలోని కృష్ణాపురానికి చెందిన ఖాదర్ బాషా కుమారుడు నవాజ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 


Published on: 16 Mar 2026 16:56  IST

చిత్తూరు జిల్లా  శాంతిపురం మండలం ఎంకే పురం పంచాయతీ పరిధిలోని కృష్ణాపురానికి చెందిన ఖాదర్ బాషా కుమారుడు నవాజ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నవాజ్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.కుటుంబ సభ్యులు, స్నేహితులు వెతకగా, మరుసటి రోజు ఉదయం కృష్ణాపురం - పొన్నేపల్లి మధ్య ఉన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని ఒక మామిడి తోటలో నవాజ్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

నవాజ్‌ను ఎవరో దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు ఉరివేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న శాంతిపురం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement