Breaking News

మూడు ప్రైవేట్ పాఠశాల బస్సులు దగ్ధం

కడప జిల్లాలోని సిద్ధవటం మండలం, కోగట గ్రామంలో10 ఏప్రిల్ 2026న మూడు ప్రైవేట్ పాఠశాల బస్సులు మంటల్లో దగ్ధమయ్యాయి.


Published on: 10 Apr 2026 16:20  IST

కడప జిల్లాలోని సిద్ధవటం మండలంకోగట గ్రామంలో10 ఏప్రిల్ 2026న మూడు ప్రైవేట్ పాఠశాల బస్సులు మంటల్లో దగ్ధమయ్యాయి. నిలిపి ఉంచిన మూడు ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అవి పూర్తిగా కాలిబూడిదయ్యాయి.ప్రమాద సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి