Breaking News

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం

2026, ఏప్రిల్ 25 శనివారం రోజున అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. 


Published on: 27 Apr 2026 18:30  IST

2026, ఏప్రిల్ 25 శనివారం రోజున అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. మృతుడి పేరు ప్రసాద్. ఆయన అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్ (SB) లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

శనివారం ఉదయం ప్రసాద్ తన ద్విచక్ర వాహనంపై సుజాత నగర్‌లోని తన నివాసం నుండి పరవాడలో విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇరువాడ వద్ద జాతీయ రహదారి (NH-16) పై అతివేగంగా వచ్చిన ఒక కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు.అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మరియు ఇతర పోలీస్ అధికారులు ప్రసాద్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి