Breaking News

కర్నూలులో నాగబంధం చిత్ర బృందం సందడి

నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్ర బృందం జూన్ 15, 2026న కర్నూలులో సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఇక్కడి నుంచే తమ దేశవ్యాప్త ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది.


Published on: 15 Jun 2026 18:34  IST

నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్ర బృందం జూన్ 15, 2026 కర్నూలులో సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఇక్కడి నుంచే తమ దేశవ్యాప్త ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది.

కర్నూలులోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహానికి చిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది.ఈ కార్యక్రమంలో సినిమా హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్ లతో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు కూడా పాల్గొన్నారు.యువతకు మన పురాణ కథలు, ప్రాచీన దేవాలయాల విశిష్టతను తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నటీనటులు తెలిపారు. ప్రమోషన్స్ ఇక్కడి నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.కొండారెడ్డి బురుజు ప్రాంగణంలో హీరోయిన్ నభా నటేష్ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించారు.

Follow us on , &

ఇవీ చదవండి