Breaking News

పెద్ద కరవాణిపాలెంలో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కరవాణిపాలెంలో మత్స్యకారుల గ్రామంలో ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సుమారు 10:30 గంటల సమయంలో మత్స్యకారుల వలలు భద్రపరిచే షెడ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


Published on: 19 Jun 2026 18:22  IST

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కరవాణిపాలెంలో మత్స్యకారుల గ్రామంలో ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సుమారు 10:30 గంటల సమయంలో మత్స్యకారుల వలలు భద్రపరిచే షెడ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సముద్రపు నీటితో మంటలను అదుపు చేయడానికి స్థానికులు, పక్క ఊరి (ఎడవానిపాలెం) వారు ప్రయత్నించినప్పటికీ మంటలు తీవ్రంగా వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో 8 కుటుంబాలషెడ్లు, ఒక బోటు, మరియు వందలాది చేపల వలలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఒక్కో షెడ్‌లో 20 నుండి 30 వలలు ఉన్నాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 1.50 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కో వల విలువ రూ. 50,000 నుండి లక్ష రూపాయల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు.ఈ ప్రమాదం వల్ల సుమారు 80 నుండి 90 మంది మత్స్యకారులు తమ జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement