Breaking News

ఘనంగా బసవతారకం శతజయంతి వేడుకలు

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలులో నందమూరి బసవతారకం గారి శత జయంతి వేడుకలు జూలై 25, 2026న అత్యంత ఘనంగా నిర్వహించారు.


Published on: 25 Jul 2026 16:49  IST

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలులో నందమూరి బసవతారకం గారి శత జయంతి వేడుకలు జూలై 25, 2026న అత్యంత ఘనంగా నిర్వహించారు.నందమూరి మోహనకృష్ణ ,ఇతర నందమూరి కుటుంబ సభ్యులు కొమరవోలులోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు.బసవతారకం గారు జన్మించిన ఆమె స్వగృహంలో కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి శత జయంతి ఉత్సవాలు జరిపారు.గ్రామంలోని పురాతన శివాలయంలో నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వగ్రామానికి విచ్చేసిన నందమూరి కుటుంబానికి కొమరవోలు గ్రామస్థులు ఘనంగా, ఘట స్వాగతం పలికారు.

కొత్త ట్రస్ట్ ఏర్పాటు

ఈ శత జయంతిని పురస్కరించుకుని నందమూరి కుటుంబం ఒక కీలక నిర్ణయం తీసుకుంది:మాతృమూర్తి జ్ఞాపకార్థం "బసవతారకం, ఎన్టీఆర్ పేరిట సరికొత్త సేవా ట్రస్ట్" ప్రారంభించారు."సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అనే దివంగత ఎన్టీఆర్ నినాదంతో పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించడమే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని నందమూరి మోహనకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా నందమూరి రూప మాట్లాడుతూ, తన నాయనమ్మ పుట్టిన ఊరికి మొదటిసారి రావడం ఎంతో గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

 

Follow us on , &

ఇవీ చదవండి