Breaking News

బలవంతంగా విద్యార్థులను ర్యాలీలకు తీసుకువెళ్లారు

పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నిరసన ర్యాలీలకు ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను బలవంతంగా తరలించారనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది.


Published on: 14 Aug 2026 13:52  IST

పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నిరసన ర్యాలీలకు ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను బలవంతంగా తరలించారనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఇటీవల వైకాపా ఆధ్వర్యంలో డిఎస్సీ (DSC) నోటిఫికేషన్ అక్రమాలపై చేపట్టిన నిరసన ప్రదర్శనల్లో జన సమీకరణ కోసం స్థానిక నేతలు కాలేజీ విద్యార్థులను ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

పులివెందులలోని ఒక ప్రైవేట్ కళాశాల వద్దకు వెళ్లిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చదువుకునే విద్యార్థులను బలవంతంగా రాజకీయ ర్యాలీల్లోకి లాగడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

వైకాపా పిలుపునిచ్చిన ఈ నిరసనలకు ప్రజల నుండి, డీఎస్సీ అభ్యర్థుల నుండి ఆశించిన స్పందన లభించకపోవడంతోనే నేతలు ఇలా ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులను బలవంతంగా తరలించారని విపక్షాలు విమర్శించాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

 

Follow us on , &

ఇవీ చదవండి