Breaking News

కిన్నెరవాడ ఘటనతో పెళ్లింట విషాదం

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ వద్ద జరిగిన ఘోర కారు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. వంశధార ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఈ ఘటనలో మామా, మేనల్లుడు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు.

Published on: 25 Aug 2026 19:22  IST

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ వద్ద జరిగిన ఘోర కారు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. వంశధార ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఈ ఘటనలో మామా, మేనల్లుడు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు.

కోటబొమ్మాలి మండలం చీపుర్లపాడుకు చెందిన పీస రాము (45), అతని మేనల్లుడు ఖరగ్పూర్‌కు చెందిన మెండ విశాల్ కుమార్ (25).సోమవారం ఒక పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా, కిన్నెరవాడ సమీపంలో వీరి కారు అదుపుతప్పి వంశధార కాలువలోకి దూసుకుపోయింది. నీటి ప్రవాహం బలంగా ఉండటంతో వారిద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

కారు డ్రైవర్ నాగరాజును స్థానికులు సమయానికి స్పందించి ప్రాణాలతో కాపాడారు.డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుక ముగిసిన కొద్దిసేపటికే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఆ కుటుంబంలో మరియు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి