Breaking News

తల్లి మందలించిందని ఇద్దరు కుమారుల ఆత్మహత్య

ఏపీలోని పల్నాడు జిల్లాలో తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఇద్దరు అన్నదమ్ములు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన 1 సెప్టెంబర్ 2026న చోటుచేసుకుంది.


Published on: 01 Sep 2026 19:07  IST

ఏపీలోని పల్నాడు జిల్లాలో తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఇద్దరు అన్నదమ్ములు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన 1 సెప్టెంబర్ 2026న చోటుచేసుకుంది.

పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం, 88 తాళ్లూరు గ్రామం.లంకోటి కోటేశ్వరరావు (29), లంకోటి సీతారామయ్య (27) అనే ఇద్దరు అన్నదమ్ములు.కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు యువకులు, కేవలం గంటల వ్యవధిలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచారు.సమాచారం అందుకున్న పల్నాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.చేతికి అందివచ్చిన ఇద్దరు కొడుకులు ఒకేసారి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో మరియు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement