Breaking News

ఆదోనిలో ఆటో-బైక్ ఢీ ఒక మహిళ మృతి

కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని నెట్టేకల్ వద్ద ఈరోజు (28 సెప్టెంబర్ 2026) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన బైక్ కూలీలతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Published on: 28 Sep 2026 18:58  IST

కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని నెట్టేకల్ వద్ద ఈరోజు (28 సెప్టెంబర్ 2026) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన బైక్ కూలీలతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణ సమీపంలోని నెట్టేకల్ వద్ద.ఆదోనిలోని కార్వాన్‌పేట, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సుమారు 13 మంది మహిళా కూలీలు పత్తి చేను పనుల కోసం ఆటోలో చిన్న పెండేకల్‌కు బయలుదేరారు. నెట్టేకల్ వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న ఒక బైక్ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది.

ఈ ఢీకొన్న తీవ్రతకు ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో, అందులో ప్రయాణిస్తున్న లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదంలో మరో ఎనిమిది మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి