Breaking News

రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి డ్రైవర్ మృతి

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత కారు డ్రైవర్ తన్నీరు శ్రీహరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.సోమవారం (అక్టోబర్ 5, 2026) రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పోల్‌రెడ్డిపాలెం బైపాస్ సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది.

Published on: 06 Oct 2026 17:15  IST

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత కారు డ్రైవర్ తన్నీరు శ్రీహరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.సోమవారం (అక్టోబర్ 5, 2026) రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పోల్‌రెడ్డిపాలెం బైపాస్ సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది.

చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన శ్రీహరి (40), తన విధులు ముగించుకుని మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక కారు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు తీవ్రంగా గాయపడిన శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి