Breaking News

ఆపరేషన్ త్రిశూల్లో భాగస్వామ్యం కండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఆపరేషన్ త్రిశూల్" (ముప్పేట ప్రజా భద్రతా కార్యక్రమం) లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి.


Published on: 15 Oct 2026 19:52  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఆపరేషన్ త్రిశూల్" లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల నిర్మూలన : గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడం.

మహిళల భద్రత : మహిళలు, బాలికలపై జరిగే నేరాల నివారణ మరియు మహిళా రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం.

రహదారి భద్రత : రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం.

జిల్లాలోని పాడేరు, అరకు వ్యాలీ, అన్నవరం, అనంతగిరి, కొయ్యూరు, జి. మాడుగుల తదితర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలలో పోలీసులు నిరంతరం ప్రజలకు, యువతకు అవగాహన కల్పిస్తూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి