Breaking News

కేఎల్ యూనివర్సిటీ నుండి నింగికి ఉపగ్రహాలు.

కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు 2025 అక్టోబర్ 18న మూడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు.


Published on: 18 Oct 2025 14:50  IST

కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు 2025 అక్టోబర్ 18న మూడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. ఇవి విద్యార్థులు స్వయంగా రూపొందించిన ఉపగ్రహాలు. ఈ మిషన్‌ను KLSAT-2 అని పిలిచారు. వాతావరణ అంచనా, రిమోట్ సెన్సింగ్ ఇమేజరీ వంటి పనుల కోసం దీనిని తయారు చేశారు.KLJAC ఇది ఫ్లైట్ ట్రాకింగ్ మరియు ఇతర సంబంధిత పరిశోధనల కోసం రూపొందించబడింది.CANSAT ఇది డాటా సేకరణ మరియు గ్రౌండ్ సిస్టమ్‌తో కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఈ లాంచ్ కేఎల్ యూనివర్సిటీ యొక్క ఘనతను చాటింది మరియు విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ రంగంలో అవకాశాలను కల్పించింది. దీనికి ముందు 2023లో కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు KLSAT అనే మరో ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

Follow us on , &

ఇవీ చదవండి