Breaking News

జస్వంతి అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి

కడప రాయచోటి - రిమ్స్ రింగ్ రోడ్డులోని ఒక ప్రైవేట్ పాఠశాల (చైతన్య స్కూల్ హాస్టల్) లో 9వ తరగతి చదువుతున్న జస్వంతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన నేడు, నవంబర్ 10, 2025 సోమవారం ఉదయం చోటుచేసుకుంది


Published on: 10 Nov 2025 15:30  IST

కడప రాయచోటి - రిమ్స్ రింగ్ రోడ్డులోని ఒక ప్రైవేట్ పాఠశాల (చైతన్య స్కూల్ హాస్టల్) లో 9వ తరగతి చదువుతున్న జస్వంతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన నేడు, నవంబర్ 10, 2025 సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వాహకులే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు.స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిందని, సరైన సమయంలో పోలీసులకు, తల్లిదండ్రులకు వివరాలు తెలియజేయలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి