Breaking News

చిత్తూర్ డివిషనల్ అధికారికార్యాలయం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూర్ డివిషనల్ అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ ఆ కార్యక్రమం లో గ్రామీణాభివృద్ధి శాఖ పని ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలను కల్పించడమేనని స్పష్టం చేశారు. 

Published on: 04 Dec 2025 16:01  IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూర్ డివిషనల్ అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ ఆ కార్యక్రమం లో గ్రామీణాభివృద్ధి శాఖ పని ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలను కల్పించడమేనని స్పష్టం చేశారు. 

ప్రతి గ్రామానికి నాణ్యమైన త్రాగునీరు మరియు గుంతలు లేని రోడ్లు అందించడం తన ప్రధాన లక్ష్యమని, జల్ జీవన్ మిషన్ మరియు పల్లె పండుగ పనులలో నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, నిధులు నేరుగా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చూడాలని సూచించారు.పనుల నాణ్యతను తనిఖీ చేయడానికి తాను స్వయంగా సాంకేతిక నిపుణులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తానని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖను ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతంగా ఉపయోగించాలని ఉద్దేశపూర్వకంగా కృషి చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి