Breaking News

మెట్ల పైకాలుజారి పడి కళాకారిణి మృతి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలంలోని శివకోటి గ్రామంలో గురువారం (డిసెంబర్ 25, 2025) రాత్రి ఒక విషాద ఘటన చోటుచేసుకుంది.


Published on: 26 Dec 2025 10:22  IST

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలంలోని శివకోటి గ్రామంలో గురువారం (డిసెంబర్ 25, 2025) రాత్రి ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) అనే కళాకారిణి మృతి చెందారు.శివకోటిలోని ముసలమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు రాజమహేంద్రవరం నుంచి వచ్చిన 12 మంది కళాకారుల బృందంలో ఆమె ఒకరు.ఆలయం ఎదురుగా ఉన్న భవనంలో బస చేసిన భవ్యశ్రీ, ప్రదర్శన కోసం తయారై పైఅంతస్తు నుంచి మెట్లపై దిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయారు.ఆమె ధరించిన పాదరక్షలు ఎత్తుగా ఉండటం వల్ల అదుపు తప్పి కింద పడ్డారని, ఆ మెట్లకు రక్షణ గోడలు (railings) లేకపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు మరియు పోలీసులు తెలిపారు.మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి